Aravind Nishad: పెళ్లి చేసుకోకపోతే ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరిస్తున్న యువకుడికి నిప్పంటించిన బాలిక

  • తొమ్మిదో తరగతి బాలికను ప్రేమించిన నిషాద్
  • బాలిక తల్లిదండ్రులకు కూడా విషయాన్ని వివరించాడు
  • పెళ్లీడు రాగానే పెళ్లి చేస్తామన్న బాలిక తల్లిదండ్రులు

తనను పెళ్లి చేసుకోవాలని లేదంటే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తున్న యువకుడికి బుద్ధి చెబుదామని ఓ అమ్మాయి అతనికి నిప్పంటించింది. ప్రస్తుతం ఆ యువకుడి పరిస్థితి విషమంగా ఉంది. యువకుడి తల్లి ఫిర్యాదుతో ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం, ఉత్తరప్రదేశ్‌లోని ఖాద్రా అనే ప్రాంతానికి చెందిన అరవింద్ నిషాన్ అనే యువకుడు తమ ఇంటి పక్కనే ఉండే తొమ్మిదో తరగతి బాలికను ప్రేమిస్తున్నాడు.

ఈ విషయాన్ని బాలిక తల్లిదండ్రులకు కూడా తెలిపాడు. దీంతో బాలికకు పెళ్లీడు రాగానే నిషాద్‌కి ఇచ్చి పెళ్లి చేస్తామని చెప్పారు. అయినప్పటికీ నిషాద్ వినకుండా ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. దీంతో నిషాద్‌కు బుద్ధి చెబుదామని ఆ బాలిక అగ్గిపుల్ల గీసి అతనిపై విసిరేసింది. ప్రస్తుతం 60 శాతం కాలిన గాయాలతో ఆ యువకుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అనంతరం తల్లీకూతుళ్లు అక్కడి నుంచి పారిపోయారని నిషాద్ చెప్పినట్టు పోలీసులు వెల్లడించారు.

Aravind Nishad
Marriage
Suicide
Uttar Pradesh
Police
  • Loading...

More Telugu News