Adilabad District: వ్యాన్‌ బోల్తాపడి 30 మందికి గాయాలు...పెళ్లింట విషాదం

  • పలువురి పరిస్థితి విషమం
  • ప్రమాదంలో గాయపడిన పెళ్లి కుమార్తె
  • ఆదిలాబాద్‌ జిల్లా పిప్పల్ దరి ఘాట్‌లో ఘటన

ఆనందోత్సాహాలతో పెళ్లి మంటపానికి తరలి వెళ్తున్న బృందం ప్రమాదం బారిన పడడంతో ఆ ఇంట విషాదం నెలకొంది. వరుని ఇంట పెళ్లి కావడంతో పెళ్లి కుమార్తెతోపాటు కుటుంబ సభ్యులు, బంధువులు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుంది. ప్రమాదంలో 30 మంది గాయపడగా వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. గాయపడిన వారిలో పెళ్లి కుమార్తె కూడా ఉండడం గమనార్హం. తెలంగాణలోని ఇంద్రవెల్లి మండలం సమాక గ్రామానికి చెందిన వారు పెళ్లి కోసం అంకోలి తంతోలికి వెళ్తుండగా ఆదిలాబాద్‌ జిల్లా పిప్పల్‌ దరి ఘాట్‌లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గాయపడిన వారిని ఆదిలాబాద్‌లోని రిమ్స్‌ ఆసుపత్రికి తరలించారు.

Adilabad District
indravelli
Road Accident
marriage family
  • Loading...

More Telugu News