Nooti Rammohanarao: సింధూ శర్మను ఇంత దారుణంగా హింసించారు...: ఫోటోలు విడుదల చేసిన స్నేహితులు

  • రిటైర్డ్ న్యాయమూర్తి నూతి రామ్మోహన్ రావు కోడలు సింధూ శర్మ
  • భర్తతో కలిసి అత్తమామలు హింసిస్తున్నారని ఫిర్యాదు
  • పలు సెక్షన్ల కింద కేసును రిజిస్టర్ చేసిన పోలీసులు

పదవీ విరమణ చేసిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నూతి రామ్మోహనరావు, ఆయన భార్య, కుమారుడు వశిష్ఠలు తనను దారుణంగా హింసించారంటూ కోడలు సింధూ శర్మ పోలీసు కేసు పెట్టడం కలకలం రేపింది. సింధూను వశిష్ఠ, అతని తల్లిదండ్రులు అత్యంత దారుణంగా హింసించారంటూ, ఆమె స్నేహితులు కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో విడుదల చేశారు. ఆమె వీపుపై గాయాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గాయాలతో ఆమె అపోలో ఆసుపత్రిలో చేరారని వారు తెలిపారు.

 కాగా, కొన్ని రోజుల క్రితమే తనకు ఎదురవుతున్న గృహహింసపై సింధు పోలీసులను ఆశ్రయించగా, సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు వశిష్ఠ, సింధు దంపతులకు మహిళా పోలీసు అధికారులు రెండుసార్లు కౌన్సెలింగ్ ఇచ్చారు. ఏకాభిప్రాయం కుదరకపోవడం, తన ఒంటిపై ఉన్న గాయాలను సింధు పోలీసులకు చూపడంతో, కేసు తీవ్రతను దృష్టిలో ఉంచుకుని రిజిస్టర్ చేశామని పోలీసులు వెల్లడించారు.

Nooti Rammohanarao
Sindhu Sharma
Police
Case
  • Loading...

More Telugu News