Andre Russel: అందుకే ఓడిపోతున్నాం... కేకేఆర్ యాజమాన్యంపై డ్యాషింగ్ బ్యాట్స్ మన్ రసెల్ మండిపాటు!

  • బ్యాటింగ్ బాగున్నా, బౌలింగ్ లో విఫలం
  • ఫీల్డర్లు క్యాచ్ లను పట్టడం లేదు
  • ఈ సీజన్ లో చెత్త ఫీల్డింగ్ కేకేఆర్ దేనన్న రసెల్

ఆడిన ప్రతి మ్యాచ్ లోనూ ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడి, సాధ్యమైనంత భారీ స్కోర్ లను సాధించే కోల్‌ కతా నైట్‌రైడర్స్‌ బ్యాట్స్‌మన్‌ ఆండ్రీ రస్సెల్‌, జట్టు యాజమాన్యంపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. వరుసగా ఆరు మ్యాచ్ లను కేకేఆర్ ఓడిపోవడం వెనుక మేనేజ్ మెంట్ తీసుకుంటున్న చెత్త నిర్ణయాలే కారణమని నిప్పులు చెరిగాడు. తమ జట్టులో మంచి వాతావరణమే లేదని వ్యాఖ్యానించిన రసెల్, వాస్తవానికి తమది మంచి జట్టని, అయితే, సరైన బౌలర్‌ను సరైన సమయంలో బౌలింగ్‌ కు దించడం లేదని, అందువల్లే ఓడిపోతున్నామని అన్నాడు.

తమ వద్ద నాణ్యమైన బౌలర్లు ఉన్నారని, వారిని సక్రమంగా వినియోగించుకుంటే ఎటువంటి జట్టునైనా 170 పరుగులకు పరిమితం చేయగలమని అన్నాడు. తమ జట్టేమీ బ్యాటింగ్ లో విఫలం కావడం లేదని, బౌలర్లు మాత్రం దారుణంగా విఫలమవుతున్నారని ఆరోపించాడు. ఫీల్డర్లు క్యాచ్ లను సరిగ్గా పట్టుకోవడం లేదని, ఈ సీజన్ లో అత్యంత చెత్త ఫీల్డింగ్ టీమ్ తమదేనని అన్నాడు. తనను లోయర్ ఆర్డర్ లో పంపడంపైనా ఆండ్రీ రసెల్ మండిపడ్డాడు. ముందుగా పంపాలని తాను కోరినా వినడం లేదని ఆరోపించాడు. ఇక ముంబైతో మ్యాచ్ లో అద్భుతం జరిగితే తప్ప తాము గెలిచే పరిస్థితి లేదని అన్నాడు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News