Kidari: కిడారి, సోమల హత్య కేసులో కీలక మలుపు... ప్రధాన నిందితుడి అరెస్ట్!

  • తీవ్ర కలకలం రేపిన జంట హత్యలు
  • కోరాపుట్ లో అరెస్ట్ చేసిన పోలీసులు
  • ట్రాన్సిట్ వారంట్ పై ఏపీకి

గత సంవత్సరం అరకు ప్రాంతంలో తీవ్ర సంచలనం సృష్టించిన ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, తెలుగుదేశం నేత సోమల హత్యకేసు కీలక మలుపు తిరిగింది. హత్య వెనుక ప్రధాన సూత్రధారిగా అనుమానిస్తున్న మావోయిస్టు నేత జయరాం ఖిల్లా అరెస్ట్ అయ్యాడు. కోరాపుట్ జిల్లాలో ఖిల్లాను అరెస్ట్ చేసినట్టు పోలీసులు స్పష్టం చేశారు.

ప్రస్తుతం ఖిల్లా ఆంధ్రా - ఒడిశా సరిహద్దులో జోనల్ కమిటీ మెంబర్ గా పని చేస్తున్నాడు. అరకు ప్రాంతంలోని అడవులు, ఈ ప్రాంత పరిస్థితులు, నేతల వివరాలు ఇతనికి కొట్టిన పిండి. ఖిల్లా నేతృత్వంలోని బృందమే, గ్రామాల్లో పర్యటిస్తున్న కిడారిని, సోమను అటకాయించి హత్య చేశారని, ఆ సమయంలో ఖిల్లా అక్కడే ఉన్నాడని పోలీసులు వెల్లడించారు. అతన్ని కోరాపుట్ న్యాయస్థానంలో ప్రత్యేక పిటిషన్ వేసి, ఏపీకి తీసుకు వస్తామని స్పష్టం చేశారు.

Kidari
Soma
Murder Case
Arrest
Jayaram Khilla
Maoist
  • Loading...

More Telugu News