Kurnool: కర్నూలు జిల్లాలో నకిలీ ఈసీ అధికారులు, పోలీసులు... లక్షల్లో కొట్టేసిన వైనం!

  • ఎన్నికల వేళ తనిఖీలు
  • డబ్బు తీసుకెళ్లిన మోసగాళ్లు
  • ఆధారాలతో రావడంతో వెలుగులోకి వచ్చిన వాస్తవం

ఆంధ్రప్రదేశ్ లో నకిలీ ఎన్నికల అధికారులు, పోలీసుల ఉదంతం ఒకటి ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. తాము పోలీసులమని, ఎన్నికల సందర్భంగా తనిఖీలు నిర్వహిస్తున్నామని చెప్పిన ఓ బృందం పలువురి నుంచి లక్షల కొద్దీ డబ్బును దోచుకుంది. ఎస్పీ కార్యాలయంకు వచ్చి, డబ్బుకు లెక్కలు చెప్పి, వాటిని తీసుకు వెళ్లాలని ఆ మోసగాళ్లు చెప్పడంతో, పలువురు నమ్మారు.

ఇదే విధంగా తన ఇంటిని విక్రయించిన ఓ వ్యక్తి, రూ. 14 లక్షలను తీసుకెళుతుండగా, వీరు పట్టుకుని ఆపారు. ఆ డబ్బును స్వాధీనం చేసుకుంటున్నామని చెప్పారు. దీంతో చేసేదేమీ లేక, ఇంటికి వెళ్లిపోయిన ఆయన, ఎన్నికలు ముగిశాక, అది తన డబ్బేనన్న ఆధారాలతో ఎస్పీ కార్యాలయానికి వెళ్లడంతో, అసలు విషయం బయటకు వచ్చింది. తన డబ్బు ఇవ్వాలని ఆయన కోరగా, అసలు తాము ఆ ప్రాంతంలో సోదాలు చేయలేదని, డబ్బు పట్టుబడినా, దాన్ని తమ వద్ద ఉంచుకోబోమని, ఐటీ శాఖకు అప్పగిస్తామని అక్కడి వారు చెప్పడంతో సదరు వ్యక్తి అవాక్కయ్యారు. విషయం తెలుసుకున్న కర్నూలు ఎస్పీ స్వయంగా కల్పించుకోవడంతో, తాలూకా పీఎస్ లో కేసు నమోదైంది. ఇదే విధంగా పలువురు మోసపోయినట్టు గుర్తించిన పోలీసులు, ఇప్పుడు కేటుగాళ్లను వెతికే పనిలో పడ్డారు. 

  • Loading...

More Telugu News