Jammu And Kashmir: బీజేపీ ర్యాలీలో పోలీసు వాహనం నుంచి కార్యకర్తలకు ఆహార పొట్లాల సరఫరా!

  • ర్యాలీకి హాజరైన వారికి పోలీసుల వాహనం నుంచి ఆహార పొట్లాల సరఫరా
  • సోషల్ మీడియాలో వీడియో వైరల్
  • విచారణకు ఆదేశించిన పోలీసులు

జమ్ముకశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌లో బీజేపీ నిర్వహించిన ర్యాలీలో ఆహార పొట్లాల సరఫరా కోసం పోలీసు వాహనాన్ని ఉపయోగించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడంతో స్పందించిన పోలీసు శాఖ ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. 28 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోలో ర్యాలీకి హాజరైన కార్యకర్తలకు పోలీసు వాహనం నుంచి ఆహార ప్యాకెట్లు, నీళ్ల సీసాల పంపిణీ చేస్తుండడం స్పష్టంగా కనిపిస్తోంది. బీజేపీ జాతీయ కార్యదర్శి రాంమాధవ్ ఈ ర్యాలీకి హాజరయ్యారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. వాహనం డ్రైవర్‌ను అటాచ్ చేసినట్టు పోలీసు అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు.

Jammu And Kashmir
Anantnag
Ram madhav
police vehcle
  • Loading...

More Telugu News