Mangalagiri: నారా లోకేశ్ ఓటమి ఖాయమట... కారణాలివేనంటున్న వైసీపీ!

  • అందరి దృష్టినీ ఆకర్షించిన మంగళగిరి
  • టీడీపీ తరఫున లోకేశ్, వైసీపీ తరఫున ఆళ్ల పోటీ
  • గెలుపుపై ఇరు పార్టీల ధీమా

ఆంధ్రప్రదేశ్ కు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గం అందరి దృష్టినీ ఆకర్షించింది. ఇక్కడి నుంచి సీఎం చంద్రబాబునాయుడు కుమారుడు లోకేశ్ టీడీపీ అభ్యర్థిగా ఉండటం, రాజధాని ప్రాంతం కావడంతో ఇక్కడి ఎన్నిక ప్రతిష్ఠాత్మకంగా సాగింది. వైసీపీ తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) పోటీ పడ్డారు. ఇక ఎన్నికల ఫలితాల వెల్లడికి నాలుగు వారాల సమయం ఉంది. గెలుపుపై ఎవరికి వారు ధీమాగా ఉన్నా, ఓటర్లు తమ భవిష్యత్తును ఎలా రాశారోనన్న ఆందోళన ఇరు పార్టీల్లోనూ నెలకొంది. అయితే, వైసీపీ మాత్రం గెలుపు తమదేనని నొక్కి మరీ చెబుతోంది. లోకేశ్ పై ఆర్కే విజయం ఖాయమని అంటోంది.

 రాజధాని ప్రాంతంలో భూములపై వైసీపీ పోరాటం చేసినందున రైతుల మద్దతు తమకే ఉందని, తాడేపల్లి పరిధిలోని భూములను గ్రీన్‌ బెల్ట్‌ నుంచి తొలగించి, వాటిని అమ్ముకునే సదుపాయం కల్పిస్తామన్న కీలక హామీ పని చేసిందని ఆ పార్టీ నేతలు అంటున్నారు. తెలుగుదేశం వస్తే ఇక్కడి ప్రభుత్వ భూములను ఐటీ కంపెనీలకు ఇస్తుందనే భయం కారణంగా, ఆ భూముల్లో నివాసం ఏర్పరుచుకున్న 30 వేల మంది తమ పార్టీకే ఓటు వేశారని అంటున్నారు. ఇదే సమయంలో ఆర్కే ప్రారంభించిన రాజన్న రైతు బజార్‌,  రాజన్న క్యాంటీన్‌ తదితరాలు ఎంతో మందికి మేలు చేకూర్చాయని, ఇవన్నీ ఓట్ల రూపంలో ఆయనపై కురిశాయని చెబుతున్నారు. ఏదేమైనా విషయం తేలాలంటే మరికొన్ని రోజులు ఆగక తప్పదు.

  • Loading...

More Telugu News