Nithin Gadkari: బహిరంగ సభలో మాట్లాడిన అనంతరం స్వల్ప అస్వస్థతకు గురైన నితిన్ గడ్కరీ

  • సదాశివ లోఖండే తరుపున ప్రచారం
  • ఎండ తీవ్రత కారణంగా అస్వస్థత
  • కాసేపటికి తేరుకున్న నితిన్ గడ్కరీ

కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత నితిన్ గడ్కరీ స్వల్ప అస్వస్థతకు లోనయ్యారు. నేడు షిర్డీ లోక్‌సభ నియోజకవర్గంలో శివసేన అభ్యర్థి సదాశివ లోఖండే తరుపున ప్రచారం నిర్వహించారు. అనంతరం రహాతాలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన అనంతరం అస్వస్థతకు లోనయ్యారు. వెంటనే అలర్ట్ అయిన సిబ్బంది ఆయనను కూర్చీలో కూర్చోబెట్టారు. ఎండ తీవ్రత కారణంగా నితిన్ గడ్కరీ అస్వస్థతకు లోనైనట్టు తెలుస్తోంది. కాసేపటికి తేరుకుని వేదిక దిగి వాహనంలోకి వెళ్లారు.

Nithin Gadkari
Shirdi
Loksabha
Sadasiva Lokhande
Rahatha
  • Loading...

More Telugu News