Narendra Modi: విపక్షాలన్నా, విమర్శలన్నా మోదీకి చాలా భయం: ప్రియాంకా గాంధీ

  • మోదీ ఒక బలహీనమైన ప్రధాని
  • మోదీ సర్కార్ అత్యంత బలహీనం
  • ప్రజా తీర్పుతోనే అధికారం

విపక్షాలన్నా, విమర్శలన్నా ప్రధాని నరేంద్ర మోదీకి చాలా భయమని, బలహీనమైన ప్రధాని కావడమే అందుకు కారణమని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఎద్దేవా చేశారు. నేడు ఆమె యూపీలోని బారాబంకీలో జరిగిన ఎన్నికల ర్యాలీలో మట్లాడుతూ, మోదీని బలహీన ప్రధానిగా, కేంద్రంలోని మోదీ సర్కార్‌ను అత్యంత బలహీనమైన ప్రభుత్వంగా అభివర్ణించారు. ప్రజా తీర్పుతోనే వ్యక్తి అయినా, ప్రభుత్వమైనా అధికారంలోకి రాగలుగుతుందనే విషయాన్ని మోదీ గ్రహించాలన్నారు.

మోదీ సొంత నియోజకవర్గంలో అభివృద్ధిని తాను చూడలేదన్నారు. మోదీని ప్రధాన ప్రచార మంత్రిగా అభివర్ణించిన ప్రియాంక, ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు ట్యాంకర్లతో నీళ్లు తెచ్చి రోడ్లను శుభ్రం చేస్తూ బీజేపీ నేతలు తాగునీటిని వృధా చేస్తున్నారని ఆరోపించారు. ముఖ్యంగా బుందేల్‌ఖండ్‌లో ప్రజలతో పాటు పశుపక్ష్యాదులు, పంటలు సైతం కరవు కోరల్లో చిక్కుకున్నాయని ప్రియాంక పేర్కొన్నారు.

Narendra Modi
Priyanka Gandhi
Uttar Pradesh
Barabanki
BJP Leaders
  • Loading...

More Telugu News