Students: ఓ హోటల్‌లో పార్టీ.. అనంతరం కూకట్‌పల్లిలో రెండు గ్రూపులుగా విడిపోయి కొట్టుకున్న విద్యార్థులు

  • పార్టీ సమయంలో విద్యార్థుల మధ్య మనస్పర్థలు
  • ఫార్చూన్ బిజినెస్ స్కూలు విద్యార్థులుగా గుర్తింపు
  • దాడి ఘటనలో ఓ మహిళకు గాయాలు

ఓ హోటల్‌లో పార్టీ చేసుకున్న విద్యార్థులు.. ఆ సమయంలో వచ్చిన మనస్పర్థల కారణంగా రెండు గ్రూపులుగా విడిపోయి కొట్టుకోవడంతో హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో కలకలం రేగింది. ఫార్చూన్ బిజినెస్ స్కూలు విద్యార్థులు ఓ హోటల్‌లో పార్టీ చేసుకున్నారు. ఆ సమయంలో వారి మధ్య మనస్పర్థలు వచ్చినట్టు సమాచారం. దీంతో కూకట్‌పల్లిలో రెండు గ్రూపులుగా విడిపోయి పరస్పరం దాడి చేసుకున్నారు.

ఈ అనూహ్య పరిణామంతో అక్కడ ఉన్న ప్రజలు భయంతో పరుగులు తీశారు. ఈ ఘటనలో ఓ మహిళకు గాయాలయ్యాయి. విద్యార్థుల దాడి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని విచారణ నిర్వహిస్తున్నారు. అయితే విద్యార్థుల మధ్య గొడవకు ప్రేమ వ్యవహారమే కారణమని తెలుస్తోంది.

Students
Kukatpally
Party
Fortune Business School
Social Media
Police
  • Loading...

More Telugu News