High Court: హైకోర్టు రిటైర్డ్ జడ్జి నూతి రామ్మోహనరావుపై ఫిర్యాదు చేసిన కోడలు సింధు శర్మ
- విచక్షణరహితంగా కొట్టారంటూ ఆక్రోశం
- భర్త, అత్తపైనా ఫిర్యాదు
- కేసు నమోదుచేసిన సీసీఎస్ పోలీసులు
హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ నూతి రామ్మోహనరావుపై ఆయన కోడలు సింధు శర్మ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన మామ రామ్మోహనరావు, భర్త వశిష్ట, అత్త దుర్గా జయలక్ష్మి తనపై దాడిచేసి విచక్షణరహితంగా కొట్టారంటూ సింధు శర్మ పోలీసులకు తెలిపారు. తనపై దాడిచేసిన వారిని కఠినంగా శిక్షించాలంటూ తన ఫిర్యాదులో కోరారు.
సింధు శర్మ ఫిర్యాదు నేపథ్యంలో సీసీఎస్ పోలీసులు జస్టిస్ నూతి రామ్మోహనరావుపైనా, ఆయన తనయుడు వశిష్టపైనా వరకట్న వేధింపుల కేసు నమోదు చేశారు. ఐపీసీ 498ఏ, 406, 323 సెక్షన్లతో పాటు, డీపీ 4, 6 చట్టాల కింద కేసు నమోదు చేశారు.
కాగా, వశిష్ట, సింధు శర్మ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. గత రెండేళ్లుగా భార్యాభర్తల మధ్య విభేదాలు నెలకొన్నాయి.