Narendra Modi: మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నా.. కుల రాజకీయాల్లోకి నన్ను లాగకండి: మోదీ

  • విపక్షాల వల్లే నా కులం గురించి తెలిసింది
  • నేనెప్పుడూ కులం గురించి ప్రస్తావించలేదు
  • విపక్ష నేతలకు ధన్యవాదాలు

130 కోట్ల జనాభా ఉన్న భారతదేశమే తన కుటుంబమని, దయచేసి కుల రాజకీయాల్లోకి తనను లాగొద్దని, చేతులెత్తి మీకు నమస్కరిస్తానంటూ ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపక్ష పార్టీలకు విజ్ఞప్తి చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్ ప్రాంతంలో నేడు ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అనంతరం మోదీ మీడియాతో మాట్లాడుతూ, విపక్ష నేతలు విమర్శించిన కారణంగానే తన కులం గురించి తెలిసిందన్న ఆయన, తానెప్పుడూ తన కులం గురించి ప్రస్తావించలేదన్నారు.

తన వెనుకబాటుతనం గురించి ప్రజలకు తెలియజెప్పినందుకు విపక్ష నేతలకు ధన్యవాదాలు తెలిపారు. పాకిస్థాన్‌లోని ఉగ్రవాదుల వల్ల భారతదేశానికి ముప్పు ఉందని, ఉగ్రవాదులను అంతమొందించేందుకు ఎస్పీ, బీఎస్పీ నేతల వద్ద ఏమైనా ఉపాయం ఉందా? అని ప్రశ్నించారు. ప్రధాని పదవి కోసం పోటీ పడుతున్న నేతలు దేశ రక్షణ, జవానుల భద్రత విషయంలో మాత్రం నోరు మెదపట్లేదని మోదీ విమర్శించారు. అసలు ఎన్నికల ప్రచారంలోనే ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఒక్కసారి కూడా విపక్ష నేతలు మాట్లాడలేదని విమర్శించారు. 

Narendra Modi
India
Uttar Pradesh
Pakistan
Terrorists
  • Loading...

More Telugu News