congress: పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి పాట్నా కోర్టు సమన్లు

  • ‘మోదీ’ ఇంటి పేరున్న వారిని అవమానించారన్న కేసు
  •  ఈ కేసులో రాహుల్ కు సమన్లు
  • మే 20న కోర్టు ఎదుట హాజరు కావాలని ఆదేశాలు

కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై బీహార్ ఉప ముఖ్యమంత్రి సుశీల్ మోదీ పరువు నష్టం దావా వేశారు. ఈ కేసులో రాహుల్ కు పాట్నా కోర్టు సమన్లు జారీ చేసింది. మే 20న కోర్టు ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. కాగా, మహారాష్ట్రలో ఇటీవల నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ‘మోదీ’ అనే ఇంటి పేరు ఉన్న వారిని రాహుల్ అవమానించారని ఆరోపిస్తూ పాట్నా కోర్టులో క్రిమినల్ కంప్లయింట్ నిన్న దాఖలు చేశారు. ఈ ఆరోపణలపై కోర్టు విచారణ జరిపి రాహుల్ కు సమన్లు జారీ చేసింది.

congress
bihar
rahul gandhi
deputy cm
sushil
  • Loading...

More Telugu News