Samir Arora: మ్యాన్ హోల్ లో పడి ఉక్కిరిబిక్కిరైన ప్రముఖ వ్యాపారవేత్త

  • ముంబయిలో ఘటన
  • ప్రమాదం తప్పించుకున్న హీలియస్ క్యాపిటల్ వ్యవస్థాపకుడు
  • ఆ కంపు భరించలేకపోయానంటూ ట్వీట్

తెరిచి ఉంచిన మ్యాన్ హోల్ లు ఎందరి ప్రాణాలను బలిగొన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ముంబయిలో ఓ ప్రముఖ వ్యాపారవేత్త మ్యాన్ హోల్ లో పడిపోయినా స్థానికులు వెంటనే రక్షించడంతో ప్రాణాలతో బతికి బయటపడ్డారు. హీలియస్ క్యాపిటల్ సంస్థ వ్యవస్థాపకుడు సమీర్ అరోరా ముంబయిలోని స్వాంకీయెస్ట్ షాపింగ్ మాల్ సమీపంలో నడుస్తుండగా ఒక్కసారిగా మ్యాన్ హోల్ లో పడిపోయారు. ఆ సమయంలో అక్కడ కొందరు వ్యక్తులు ఉండడం ఆయన పాలిట అదృష్టం అని చెప్పాలి.

వారు వెంటనే స్పందించి అరోరాను మ్యాన్ హోల్ నుంచి బయటికి తీశారు. దీనిపై అరోరా ట్విట్టర్ ద్వారా స్పందించారు. "ఆ మ్యాన్ హోల్ లో భరించలేనంత కంపు, నరకంలా అనిపించింది. కొద్ది వ్యవధిలోనే వణికిపోయాను. ప్రతి ఒక్కరూ మ్యాన్ హోల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి" అంటూ తన భయానక అనుభవాన్ని వివరించారు.

కాగా, ఆయనకు చెందిన ఖరీదైన శాంసంగ్ ఫోన్ మాత్రం మ్యాన్ హోల్ లోనే ఉండిపోయింది. దీనిపైనా అరోరా స్పందిస్తూ, ఒకవేళ బృహన్ ముంబయి మునిసిపల్ కార్పొరేషన్ వారికి తన ఫోన్ దొరికితే, తన కానుకగా వాళ్లే ఉంచుకోవచ్చని అన్నారు.

  • Loading...

More Telugu News