Andhra Pradesh: సంక్షేమం, అభివృద్ధి చేసిన వారికే ప్రజలు పట్టం కడతారు, మే 19న ఎగ్జిట్ పోల్ ఫలితాలు చెబుతా: మాజీ ఎంపీ లగడపాటి

  • సంక్షేమం, అభివృద్ధి చేసిన వారికే ప్రజల పట్టం 
  • తెలంగాణలో నా సర్వే ఎందుకు లెక్క తప్పిందో చెబుతా 
  • అమెరికాలో లగడపాటి రాజగోపాల్

కాలిఫోర్నియాలో ఎన్నారై టీడీపీ ‘మీట్ అండ్ గ్రీట్’ కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి కోమటి జయరామ్ అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ ఎల్వీఎస్ ఆర్కే ప్రసాద్, మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ‘ఆంధ్రా ఆక్టోపన్’ లగడపాటి మాట్లాడుతూ, మే 19న ఎగ్జిట్ పోల్ ఫలితాలు చెబుతానని అన్నారు. సంక్షేమం, అభివృద్ధి చేసిన వారికే ప్రజలు పట్టం కడతారని అభిప్రాయపడ్డారు. తెలంగాణలో తన సర్వే ఎందుకు లెక్క తప్పిందో ఆరోజున చెబుతానని అన్నారు.

చంద్రబాబాబు మళ్లీ సీఎం కావడం ఖాయం

టీడీపీకి 130కు పైగా సీట్లు ఖాయమని, మళ్లీ చంద్రబాబు సీఎం అవుతారని ఎల్వీఎస్ ఆర్కే ప్రసాద్ ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ చేపట్టిన సంక్షేమ కార్యక్రమాల పట్ల ప్రజలంతా సంతోషంగా ఉన్నారని, ఏ రాష్ట్రంలోనూ జరగని అభివృద్ధి ఏపీలో జరిగిందని అన్నారు. 

Andhra Pradesh
Telangana
congress
lagadapati
  • Loading...

More Telugu News