India: పాక్ ఓ బుల్లెట్ కాలిస్తే.. మేం ఫిరంగి గుండుతో జవాబిస్తాం!: బీజేపీ చీఫ్ అమిత్ షా హెచ్చరిక

  • మళ్లీ గెలిస్తే ఆర్టికల్ 370ను రద్దుచేస్తాం
  • కశ్మీర్ ను విడగొట్టాలన్న పాక్ కల నెరవేరదు
  • జార్ఖండ్ లో ఎన్నికల ప్రచారంలో బీజేపీ అధ్యక్షుడు

కేంద్రంలో మళ్లీ అధికారంలోకి వస్తే జమ్మూకశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేస్తామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ప్రకటించారు. జాతీయ భద్రత విషయంలో తాము  రాజీ పడబోమని వ్యాఖ్యానించారు. జార్ఖండ్ లో ఈరోజు జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ ప్రభుత్వం ఉన్న సమయంలో పాక్ ఉగ్రసంస్థలు భారత్ ను లక్ష్యంగా చేసుకునేవని తెలిపారు. భారత్ నుంచి కశ్మీర్ ను వేరు చేయాలన్న పాక్ కల ఎన్నటికీ నెరవేరదన్నారు. ‘పాకిస్థాన్ నుంచి ఓ తూటా భారత్ వైపు వస్తే.. భారత్ నుంచి ఓ ఫిరంగి గుండు పాక్ కు వెళుతుంది’ అని హెచ్చరించారు.

India
Pakistan
BJP
Amit Shah
warning
Jammu And Kashmir
  • Loading...

More Telugu News