Telangana: త్రిసభ్య కమిటీ నివేదికను కేసీఆర్ సర్కారు బయటపెట్టాలి: పొన్నం డిమాండ్

  • కేటీఆర్ సిఫారసుతోనే గ్లోబరినాకు పట్టం కట్టారు
  • కావాలనే విద్యావ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారు
  • సమాజంలో విద్యావంతులు ఉంటే ప్రశ్నిస్తారని కేసీఆర్ కు భయం

తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నం ప్రభాకర్ ఇంటర్ మార్కుల వ్యవహారంపై స్పందించారు. ఆయన కరీంనగర్ లో మీడియాతో మాట్లాడుతూ, ఇంటర్ మార్కుల అవకతవకలపై త్రిసభ్య కమిటీ సమర్పించిన నివేదికను తెలంగాణ సర్కారు బయట పెట్టాలని కోరారు. ఓవైపు కేటీఆర్, మరోవైపు కేసీఆర్ రాష్ట్ర విద్యావ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. సమాజంలో విద్యావంతులు ఉంటే ప్రశ్నిస్తారని కేసీఆర్ కు భయం పట్టుకుందని, అందుకే విద్యావ్యవస్థను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.

మరోవైపు, ఇంటర్ విద్యార్థుల సమస్యలపై కేటీఆర్ ఎందుకు మౌనంగా ఉంటున్నారంటూ పొన్నం ప్రశ్నించారు. అసలు, గ్లోబరినా సంస్థకు రూ.125 కోట్ల విలువైన కాంట్రాక్టు దక్కడానికి కేటీఆరే కారణమని ఆరోపించారు. కేటీఆర్ సిఫారసు మేరకే గ్లోబరినా సంస్థకు కీలకమైన కాంట్రాక్టు దక్కిందని అన్నారు.

  • Loading...

More Telugu News