Uttar Pradesh: నేను చిన్న హెలికాప్టర్ లో ఇరుక్కుని కూర్చుంటే.. నా సోదరి పెద్ద హెలికాప్టర్ లో వెళుతోంది!: రాహుల్ గాంధీ చమత్కారం

  • యూపీలోని కాన్పూర్ లో కాంగ్రెస్ నేతల ప్రచారం
  • సోదరి ప్రియాంకను ఆటపట్టించిన రాహుల్ గాంధీ
  • సోషల్ మీడియాలో వీడియో వైరల్

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నేతలు సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. తక్కువ సమయం ఉన్న నేపథ్యంలో వేగంగా పర్యటిస్తూ, పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఆయన సోదరి ప్రియాంక కూడా పలు ప్రాంతాల్లో పర్యటించి పార్టీ అభ్యర్థుల కోసం ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో ఈరోజు ఉదయం ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది. సోదరి ప్రియాంకతో రాహుల్ సరదాగా ముచ్చటించారు.

అనంతరం కెమెరాను చూసిన రాహుల్ అటుగా వచ్చి.. ‘మంచి సోదరుడంటే ఎలా ఉండాలో నేను మీకు చెబుతాను. ఎన్నికల ప్రచారంలో చాలాదూరం తిరుగుతున్న నేను చిన్న హెలికాప్టర్ లో ఇరుక్కుని వెళుతుంటే, నా సోదరి ప్రియాంక ఏమో దగ్గర్లోనే ఉన్న కార్యక్రమానికి కూడా పెద్ద హెలికాప్టర్ లో వెళుతోంది’ అంటూ చమత్కరించారు. అనంతరం రాహుల్ అక్కడి నుంచి పర్యటనకు వెళ్లిపోయారు. ఈ వీడియోలో రాహుల్ మాట్లాడుతుండగా, ప్రియాంక నవ్వుతూనే ఉన్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Uttar Pradesh
Congress
Rahul Gandhi
priyanka gandhi
funny vedio
Social Media
viral
Twitter
  • Loading...

More Telugu News