kakani: నారా లోకేశ్ ఓటమి ఖాయం: కాకాని గోవర్ధన్

  • ఓటమి భయంతో చంద్రబాబు ఆరోపణలు చేస్తున్నారు
  • కేసీఆర్ తో పోల్చుకుని సమీక్షలు నిర్వహించడం సరికాదు
  • సోమిరెడ్డిని ప్రజలు ఓడించబోతున్నారు

గుంటూరు జిల్లా మంగళగిరిలో మంత్రి నారా లోకేశ్ ఓడిపోవడం ఖాయమని వైసీపీ సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ అన్నారు. రాష్ట్రంలో వైసీపీ ఘన విజయం సాధించబోతోందని... ఓటమి భయంతోనే ఈసీతో పాటు వైసీపీపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. చంద్రబాబు మతి భ్రమించి మాట్లాడుతున్నారని అన్నారు. చంద్రబాబు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అనే విషయాన్ని గుర్తుంచుకోవాలని... తెలంగాణ సీఎం కేసీఆర్ తో పోల్చుకుని సమీక్షలు నిర్వహించడం సరికాదని చెప్పారు. వ్యవసాయ మంత్రి సోమిరెడ్డి సమీక్ష పెడతాననడంపై ఆయన మండిపడ్డారు. ధాన్యం విక్రయాలు జరుగున్న తరుణంలో కమిషన్ల కోసమే సమీక్ష పెడతానంటున్నారని ఆరోపించారు. అంతులేని అవినీతికి పాల్పడిన సోమిరెడ్డిని ప్రజలు ఓడించనున్నారని చెప్పారు.

kakani
somireddy
Chandrababu
ysrcp
Telugudesam
lokesh
  • Loading...

More Telugu News