Telangana: ఇంటర్లో తప్పినందుకు.. ఆత్మహత్య చేసుకున్న మరో విద్యార్థిని!

  • నారాయణపేట జిల్లాలోని ధన్వాడ మండలంలో ఘటన
  • ఇంటర్ బైసీపీ చదువుతున్న శిరీష
  • ఫలితాల్లో జువాలజీ పరీక్షలో తప్పినట్లు తేలడంతో మనస్తాపం

తెలంగాణ ఇంటర్ బోర్డు నిర్వాకం నేపథ్యంలో మరో విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. తాజాగా ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ అయినందుకు మనస్తాపం చెందిన ఓ బాలిక ప్రాణాలు తీసుకుంది. నారాయణపేట్ జిల్లా ధన్వాడ మండలం కోడ్రోన్ పల్లి గ్రామానికి చెందిన శిరీష ఈరోజు ఒంటిపై కిరోసిన్ పోసుకుని బలవన్మరణానికి పాల్పడింది. తాను బాగా చదివినప్పటికీ ఇంటర్ లో ఓ సబ్జెక్టులో ఫెయిల్ కావడంతో యువతి ఈ తీవ్ర నిర్ణయం తీసుకుంది.

జిల్లాలోని ఓ కళాశాలలో శిరీష ఇంటర్ బైపీసీ చదువుతోంది. అయితే జువాలజీ పరీక్షలో తప్పడంతో మనస్తాపానికి గురైన యువతి ఇంటి మిద్దె పైకి వెళ్లి కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. కానీ మంటల బాధ తాళలేక పైనుంచి కిందకు దూకేసింది. కాసేపటికే మరణించింది. మరోవైపు శిరీష మరణంపై కేసు నమోదు చేసిన నారాయణపేట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Telangana
inter results
suicide
22 dead
  • Loading...

More Telugu News