ACB: ఇతరుల అవినీతిపై విచారణ చేసే స్థితిలో ఏబీ వెంకటేశ్వరరావు ఉన్నారా?: విజయసాయిరెడ్డి

  • అవినీతి తిమింగలాలను ఆయన పట్టేస్తారట
  • ‘హతోస్మి’ అని నాకు అనిపించింది
  • చంద్రబాబు కోసం అడ్డమైన పనులు చేసిన వ్యక్తి ఏబీ

ఏపీ ఏసీబీ డీజీ ఏబీ వెంకటేశ్వరరావుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శలతో పాటు ప్రశ్నల వర్షం కురిపించారు. అవినీతి తిమింగలాలను పట్టేస్తానని ఏబీ వెంకటేశ్వరరావు అంటుంటే ‘హతోస్మి’ అని తనకు అనిపించిందని సెటైర్లు విసిరారు. చంద్రబాబు కోసం ఫోన్ ట్యాపింగ్స్, ఎమ్మెల్యేల కొనుగోళ్లు మొదలు, అడ్డమైన పనులన్నీ చేసిన వ్యక్తి ఏబీ వెంకటేశ్వరరావు అని ఆరోపించారు. ఏబీ వెంకటేశ్వరరావు తనపై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణ ఎదుర్కొనే స్థితిలో ఉన్నారా? ఇతరుల అవినీతిపై విచారణ చేసే స్థితిలో ఉన్నారా? అని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు.

ACB
DG
AB
Venkateswara rao
vijayasai
  • Loading...

More Telugu News