polavaram project: అవినీతిలో కూరుకుపోయిన విజయసాయిరెడ్డికి ఇవేవీ కనిపించవు: దేవినేని ఉమ

  • ‘పోలవరం’ గురించి వీళ్లా మాట్లాడేది!
  • వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలి
  • పులివెందులకు నీళ్లిచ్చిన విషయమై జగన్ ఏనాడైనా పొగిడారా?

అవినీతిలో కూరుకుపోయిన వాళ్లా పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడేదంటూ వైసీపీ నేత విజయసాయిరెడ్డిపై ఏపీ మంత్రి దేవినేని ఉమ మండిపడ్డారు. అమరావతిలో ఈరోజు ఆయన మాట్లాడుతూ, ట్వీట్స్ చేయడం కాదు, మీడియా సమావేశం ఏర్పాటు చేసి విజయసాయిరెడ్డి మాట్లాడాలని సూచించారు. పోలవరం ప్రాజెక్టుపై వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు. ఈ ప్రాజెక్టులో మనం పెట్టిన ఖర్చు ఇంత వరకూ కేంద్రం చెల్లించలేదని విమర్శించారు.

ఈ ప్రాజెక్టు నిర్మాణానికి గాను పలు అవార్డులు వచ్చాయని, కేంద్ర విద్యుత్ శాఖ మంత్రే ఢిల్లీకి పిలిచి ఈ అవార్డులు ఇచ్చిన విషయాన్ని ప్రస్తావించారు. అవినీతిలో కూరుకుపోయిన విజయసాయిరెడ్డికి ఇవేమీ కనిపించవని ఎద్దేవా చేశారు. పట్టిసీమ వల్ల రైతులు ఎంతో ప్రయోజనం పొందారని, అవినీతిలో కూరుకుపోయిన నేతలకు ఈ ఫలాలు కనిపించవని అన్నారు. పులివెందులకు నీళ్లిచ్చిన విషయమై జగన్ ఏనాడైనా పొగిడారా? అని ప్రశ్నించారు.

polavaram project
minister
devineni uma
YSRCP
  • Loading...

More Telugu News