Chhattisgarh: పెళ్లికి వెళ్తుండగా వ్యాన్ బోల్తా.. ఏడుగురి మృతి

  • చత్తీస్‌గఢ్‌లోని ధరగావ్ వద్ద ఘటన
  • ప్రమాద సమయంలో వ్యానులో 40 మంది
  • మృతుల్లో చిన్నారులు, మహిళలు

చత్తీస్‌గఢ్‌లో పెళ్లి వ్యాను బోల్తాపడిన ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. బలరాంపూర్ జిల్లా శంకర్‌గఢ్‌లో జరిగిందీ ఘటన. ఓ పెళ్లిలో పాల్గొనేందుకు దాదాపు 40 మంది వ్యాన్‌లో బుల్సీ నుంచి అమేరా  వెళ్తుండగా గత రాత్రి ధరగావ్ వద్ద ప్రమాదం జరిగినట్టు పోలీసులు తెలిపారు. ప్రమాదం జరిగిన అరగంట వరకు అంబులెన్స్ రాలేదని దీంతో తీవ్రంగా గాయపడిన మరికొందరు మృతి చెందినట్టు స్థానికులు తెలిపారు. మృతి చెందిన వారిలో చిన్నారులు, మహిళలు కూడా ఉన్నారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను అంబికాపూర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Chhattisgarh
marriage
van
Road Accident
  • Loading...

More Telugu News