Anil Kumar: ప్రముఖ టాలీవుడ్ సినీ నిర్మాత అనిల్ కుమార్ మృతి

  • క్యాన్సర్‌తో బాధపడుతున్న అనిల్ కుమార్
  • చికిత్స పొందుతూ మృతి
  • సినీ ప్రముఖుల సంతాపం

ప్రముఖ తెలుగు సినీ నిర్మాత కోనేరు అనిల్ కుమార్ కన్నుమూశారు. కొంత కాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న అనిల్ కుమార్ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. హీరో శ్రీకాంత్ కు సన్నిహితుడైన అనిల్ కుమార్ ఎన్నో హిట్ సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. కె.రాఘవేంద్రరావు రూపొందించిన ‘అల్లరి బుల్లోడు’, బాపు దర్శకత్వంలో తెరకెక్కిన ‘రాధా గోపాళం’తో పాటు ‘ఒట్టేసి చెబుతున్నా’ తదితర చిత్రాలకు అనిల్ కుమార్ నిర్మాతగా వ్యవహరించారు. అనిల్ కుమార్ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.

Anil Kumar
Producer
Cancer
Hyderabad
K. Raghavender Rao
Bapu
  • Loading...

More Telugu News