yandamuri: 'తులసిదళం' నవలని వర్మ కాపీ కొట్టాడు: యండమూరి
- థియేటర్ కి వెళ్లి సినిమాలు చూసి చాలా కాలమైంది
- నేను ఏమైనా అనుకుంటానేమోనని వర్మ పిలిచాడు
- సినిమా నచ్చితే బాగా తీశాడే అనుకుంటాను
తాజా ఇంటర్వ్యూలో యండమూరి మాట్లాడుతూ అనేక విషయాలను గురించి ప్రస్తావించారు. "నేను రాసి సినిమాలుగా తీయబడిన నవలల్లో 'రక్తసిందూరం' .. 'ముత్యమంత ముద్దు' నాకు ఇష్టం. ఇక నేను రాసిన మొత్తం నవలల్లో నాకు బాగా నచ్చినవిగా 'ఆనందో బ్రహ్మ' .. 'అంతర్ముఖం' ఉంటాయి.
ఇక సినిమాల విషయానికొస్తే, ఈ మధ్యకాలంలో నేను సినిమాలు చూడలేదు. నేను థియేటర్ కి వెళ్లి సినిమాలు చూసి 15 సంవత్సరాలైంది. చాలాకాలం క్రితం వర్మ 'ఫూన్క్' అనే సినిమా ప్రివ్యూకి పిలిస్తే వెళ్లాను. 'తులసిదళం' నవలని కాపీ కొట్టి తీశాడు. నేను ఏమైనా అనుకుంటానేమోనని నన్ను పిలిచాడు. మా మనవడు పట్టుబట్టడంతో ఈ మధ్యనే ఒక ఇంగ్లిష్ సినిమాను చూశాను. దర్శకుల విషయానికొస్తే, టీవీలో ఆ సినిమాలు చూసినప్పుడు 'బాగా తీశాడే' అనుకుంటాను" అని చెప్పుకొచ్చారు.