Telugudesam: పార్టీ మారడం ఎవరికైనా బాధే, టీడీపీని వీడినప్పుడు నేనూ బాధపడ్డా: ఎర్రబెల్లి

  • తెలంగాణలో టీడీపీ బిచాణా ఎత్తేసింది
  • త్వరలో కాంగ్రెస్ కూడా కనుమరుగుకానుంది
  • వరంగల్ మేయర్ ఎన్నిక ఏకాభిప్రాయం మేరకే ఉంటుంది

పార్టీ మారడం ఎవరికైనా బాధగానే ఉంటుందని, టీడీపీని వీడినప్పుడు తాను కూడా బాధపడ్డానని తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. వరంగల్ లో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణలో టీడీపీ బిచాణా ఎత్తేయడంతో తాను టీఆర్ఎస్ లో చేరాల్సి వచ్చిందని గుర్తుచేసుకున్నారు. తెలంగాణలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కూడా అదేనని, త్వరలో కనుమరుగుకాబోతోందని అభిప్రాయపడ్డారు. కాగా, వరంగల్ మేయర్ ఎన్నిక ఏకాభిప్రాయం మేరకే ఉంటుందని స్పష్టం చేశారు. వరంగల్ లోని స్థానిక గార్డెన్స్ లో కార్పొరేటర్ల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎర్రబెల్లి, బాలమల్లు, పల్లా రాజేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Telugudesam
TRS
Errabelli
Dayakar rao
t-congress
  • Loading...

More Telugu News