Andhra Pradesh: ఏపీ సీఎస్ పై టీడీపీ నేతల మండిపాటు

  • సీఎస్ రాజకీయ కార్యకలాపాలు మానుకోవాలి
  • ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలి
  • కాపర్ డ్యామ్ పూర్తికి సీఎస్ ఏం చర్యలు చేపట్టారు?

ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యంపై టీడీపీ నేతలు మాల్యాద్రి, భూషణ్ రెడ్డి మండిపడ్డారు. రాజకీయ కార్యకలాపాలు మానుకుని ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని సీఎస్ కు సూచించారు. ఏపీకి తుపాను ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్నప్పటికీ ఎలాంటి చర్యలూ తీసుకోవట్లేదని సీఎస్ పై మండిపడ్డారు. పోలవరం కాపర్ డ్యామ్ పూర్తికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని ప్రశ్నించారు. పుస్తకాల ముద్రణకు ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇంటెలిజెన్స్ చీఫ్ ఇప్పటి వరకూ సీఎంకు రిపోర్టు చేయని విషయాన్ని వారు ప్రస్తావించారు.  

Andhra Pradesh
polavaram
cs
Lv subramanyam
  • Loading...

More Telugu News