Telugudesam: ఏపీలో టీడీపీ వెయ్యి శాతం అధికారంలోకి రాబోతోంది: నక్కా ఆనందబాబు

  • ప్రభుత్వ సంక్షేమ పథకాలే టీడీపీని గెలిపిస్తాయి
  • ఎన్నికల కమిషన్ ఏకపక్షంగా వ్యవహరిస్తోంది
  • ఈసీ తీరు అనుమానాస్పదంగా ఉంది

ఏపీలో టీడీపీ వెయ్యి శాతం అధికారంలోకి రాబోతోందని మంత్రి నక్కా ఆనందబాబు  విశ్వాసం వ్యక్తం చేశారు. గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్శిటీలో ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్స్ ను నేడు ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏపీలో ప్రభుత్వ సంక్షేమ పథకాలే టీడీపీని గెలిపిస్తాయని అన్నారు. యూనివర్శిటీలోని స్ట్రాంగ్ రూమ్స్ వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలకు తరచుగా అంతరాయం ఏర్పడటంపై టీడీపీ శ్రేణులు అసంతృప్తితో ఉన్నాయని అన్నారు. ఎన్నికల కమిషన్ ఏకపక్షంగా వ్యవహరిస్తోందని, ఈసీ తీరు అనుమానాస్పదంగా ఉందని ఆరోపించారు. ఈసీ తీరు కారణంగా వ్యవస్థలపై నమ్మకం పోతోందని విమర్శించారు.

Telugudesam
Chandrababu
minister
Nakka
Anandbabu
  • Loading...

More Telugu News