jayalalitha: జయలలిత మృతి కేసు విచారణపై స్టే విధించిన సుప్రీంకోర్టు

  • కేసును విచారిస్తున్న అరుముగస్వామి కమిషన్
  • తమ డాక్టర్లను వేధిస్తున్నారంటూ కోర్టును ఆశ్రయించిన అపోలో హాస్పిటల్స్
  • కమిషన్ విచారణపై అభ్యంతరం

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మృతి కేసు విచారణపై సుప్రీంకోర్టు స్టే విధించింది. విచారణ జరుపుతున్న కమిషన్ పై అపోలో ఆసుపత్రి యాజమాన్యం అభ్యంతరం వ్యక్తం చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ ను మద్రాస్ హైకోర్టు కొట్టి వేసింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టును అపోలో యాజమాన్యం ఆశ్రయించింది. పిటిషన్ ను విచారించిన సుప్రీంకోర్టు... అరుముగస్వామి కమిషన్ విచారణపై స్టే విధించింది.

జయ వ్యక్తిగత వైద్యుడు శివకుమార్ సహా 100 మందికి పైగా వ్యక్తులను అరుముగస్వామి కమిషన్ ప్రశ్నించింది. వీరిలో అపోలో ఆసుపత్రి రేడియాలజిస్ట్ డాక్టర్ మీరా, ఎమర్జెన్సీ డాక్టర్ పజని కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో, తమ వైద్యులను కమిషన్ వేధిస్తోందంటూ అపోలో యాజమాన్యం కోర్టును ఆశ్రయించింది.

jayalalitha
supreme court
arumugaswamy commission
  • Loading...

More Telugu News