Raghuram Rajan: నా భార్య వదిలేసి వెళ్లిపోతానంది: రఘురామ్ రాజన్

  • రాజకీయాలంటే ఆసక్తి లేదు
  • ప్రతి చోటా రాజకీయాలుంటాయి
  • యూపీఏలానే ఎన్డీయే కూడా కనిపిస్తోందన్న రాజన్

తనకు రాజకీయాలంటే ఎంతమాత్రమూ ఆసక్తి లేదని రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్, ఆర్థికవేత్త రఘురామ్ రాజన్ వ్యాఖ్యానించారు. తాజాగా, మీరు రాజకీయాల్లో చేరుతారా? అని ఆయన్ను అడుగగా, తన భార్య గురించి ప్రస్తావిస్తూ, కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లోకి వెళితే, తన భార్య వదిలేసి వెళ్లిపోతానని వార్నింగ్ ఇచ్చిందని అన్నారు. తనతో ఉండేది లేదని తెగేసి చెప్పిందని అన్నారు.

 ప్రతి చోటా రాజకీయాలు ఉంటూనే ఉంటాయని అభిప్రాయపడ్డ రాజన్, ప్రస్తుతం అధ్యాపకుడిగా ఉన్నానని, ఈ ఉద్యోగంలో తనకెంతో సంతోషం కలుగుతోందని చెప్పారు. యూపీఏ ప్రభుత్వం ఏం చేసిందో, ఇప్పుడు ఎన్డీయే ప్రభుత్వం కూడా అలాగే కనిపిస్తోందని రఘురామ్ రాజన్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే, తనను కేంద్రమంత్రిని చేస్తారని వస్తున్న వార్తలు ఊహాగానాలేనని స్పష్టం చేశారు.

Raghuram Rajan
Wife
Politics
  • Loading...

More Telugu News