neerav modi: నీరవ్‌ మోదీ బెయిల్‌ పిటిషన్‌పై నేడు విచారణ.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ

  • పీఎన్‌బీ రుణాల ఎగవేత కేసులో నిందితుడు
  • ప్రస్తుతం లండన్‌లోని వాండ్స్‌వర్త్‌ జైలులో
  • అక్కడి నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో విచారణ

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు నుంచి భారీ మొత్తం రుణం తీసుకుని విదేశాలకు చెక్కేసిన వజ్రాల వ్యాపారి నీరవ్‌మోదీ ఇటీవల లండన్ లో అరెస్టయిన విషయం విదితమే. ఆయన పెట్టుకున్న బెయిల్‌ పిటిషన్‌పై అక్కడి కోర్టు ఈరోజు విచారణ జరపనుంది. అక్కడి వెస్ట్‌మినిస్టర్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు చీఫ్‌ మేజిస్ట్రేట్‌ ఎమ్మా అర్బుథ్నాట్‌ ఈ బెయిల్‌ పిటిషన్‌పై విచారణ నిర్వహించనున్నారు. ఇందుకోసం జైలులో ఉన్న నీరవ్‌తో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడి ఆయన వాదన విననున్నారు. అనంతరం నీరవ్ కు బెయిల్‌ ఇవ్వాలా? లేక రిమాండ్‌ పొడిగించాలా? అన్న విషయమై నిర్ణయం తీసుకుంటారు. 

neerav modi
london
PNB
bail pitition
  • Loading...

More Telugu News