Rayalaseema: భానుడి ప్రతాపానికి మండుతున్న రాయలసీమ!

  • కర్నూలులో 43.6 డిగ్రీల ఉష్ణోగ్రత
  • పొడి వాతావరణంతో ఇబ్బందులు పడుతున్న ప్రజలు
  • కోస్తాంధ్రలో అక్కడక్కడా ఉరుములతో కూడిన వర్షాలు

భానుడి ప్రతాపానికి రాయలసీమ మండుతోంది. గురువారం నాడు కర్నూలులో అత్యధికంగా 43.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదుకాగా, మిగతా ప్రాంతాల్లోనూ ఇంచుమించు అంతే వేడిమి నమోదైంది. తెల్లారినప్పటి నుంచి సాయంత్రం వరకు వేడి వాతావరణం కొనసాగడంతో ప్రజలు బయటకు రావడానికి భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. రాయలసీమతో పాటు కోస్తాల్లో సైతం పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా రెండు నుంచి నాలుగు డిగ్రీలు అధికంగా నమోదయ్యాయి.

ఛత్తీస్‌గఢ్‌ పరిసరాల్లో నెలకొన్న ఆవర్తనం, కర్ణాటకపై ఉపరితల ఆవర్తన ద్రోణి కొనసాగడం కూడా ఎండ వేడిమి పెరగడానికి కారణమని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. కోస్తాంధ్రలో అక్కడక్కడా ఉరుములతో కూడిన వర్షాలు కురవగా, వచ్చే 48 గంటలు సైతం ఇదే విధమైన వాతావరణం ఉంటుందని, రాయలసీమలో మాత్రం ఎండలు ఎక్కువగానే ఉంటాయని అధికారులు వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News