Chandrababu: సిమ్లాకు వెళుతున్న చంద్రబాబు ఫ్యామిలీ!

  • మూడు రోజుల పాటు పర్యటన
  • తిరిగి సోమవారం అమరావతికి
  • కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లనున్న బాబు

నేటి నుంచి మూడు రోజుల పాటు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, తన ఫ్యామిలీతో కలిసి హిమాచల్ ప్రదేశ్ లో పర్యటించనున్నారు. వేసవి కాలం కావడంతో, మండుతున్న ఎండల నుంచి కాసింత ఉపశమనాన్ని పొందేందుకు ఈ దఫా ఆయన సిమ్లాను ఎంచుకున్నారు. నేడు హిమాచల్ ప్రదేశ్ కు వెళ్లనున్న సీఎం ఫ్యామిలీ, తిరిగి సోమవారం నాడు అమరావతి చేరుకోనుంది. చంద్రబాబుతో పాటు ఆయన భార్య భువనేశ్వరి, కుమారుడు లోకేశ్, కోడలు బ్రాహ్మణి, మనవడు దేవాన్ష్ తదితరులు వెళ్లనున్నారని అధికార వర్గాలు వెల్లడించాయి.

Chandrababu
Vacation
Himachal Pradesh
Simla
Tour
  • Loading...

More Telugu News