Telangana: వారం రోజుల తర్వాత కేసీఆర్ స్పందించడం దారుణం!: డీకే అరుణ

  • ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే విద్యార్థుల ఆత్మహత్యలు
  • కేసీఆర్ కు ఎన్నికలపై ఉన్న శ్రద్ద విద్యార్థులపై లేదు
  • అవినీతితో రాష్ట్రంలో పాలన గాడి తప్పింది

ఇంటర్ ఫలితాల గందరగోళంతో విద్యార్థుల ఆత్మహత్యలకు పాల్పడ్డ వారం రోజుల తర్వాత సీఎం కేసీఆర్ స్పందించడం దారుణమని బీజేపీ నాయకురాలు డీకే అరుణ విమర్శించారు. ఇంటర్ ఫలితాల్లో జరిగిన అవకతవకలపై గవర్నర్ నరసింహన్ కు బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. అనంతరం, మీడియాతో ఆమె మాట్లాడుతూ, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని, కేసీఆర్ కు ఎన్నికలపై ఉన్న శ్రద్ద విద్యార్థులపై లేదని మండిపడ్డారు. కేసీఆర్ పాలన ఫాంహౌస్ కే పరిమితమైందని, అవినీతితో రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని విమర్శించారు.

Telangana
governer
BJP
DK Aruna
kcr
TRS
  • Loading...

More Telugu News