Dalbir Singh: సీషెల్స్‌లో భారత హైకమిషనర్‌గా ఆర్మీ మాజీ చీఫ్ దల్బీర్ సింగ్ సుహాగ్ నియామకం!

  • సీషెల్స్‌కు అత్యంత కీలకమైన దేశంగా భారత్
  • 2016 వరకూ సైన్యాధిపతిగా దల్బీర్
  • త్వరలోనే భారత హైకమిషనర్‌గా బాధ్యతలు

సీషెల్స్‌లో భారత హైకమిషనర్‌గా ఆర్మీ మాజీ చీఫ్ దల్బీర్ సింగ్ సుహాగ్ నియమితులయ్యారు. హిందూ మహా సముద్రంలో భారత్‌కు సీషెల్స్ అత్యంత కీలకమైన దేశంగా ఉంది. విశ్రాంత జనరల్ దల్బీర్ సింగ్ 31 డిసెంబర్ 2016 వరకూ సైన్యాధిపతిగా పనిచేశారు. 1987లో శ్రీలంకలోని భారత శాంతి పరిరక్షణ దళంలో ఒకరిగా దల్బీర్ ఉన్నారు. త్వరలోనే దల్బీర్ సీషెల్స్‌లో భారత హైకమిషనర్‌గా బాధ్యతలు స్వీకరిస్తారని విదేశాంగశాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

Dalbir Singh
Bharath
Sri Lanka
High Commissioner
  • Loading...

More Telugu News