Andhra Pradesh: ఏపీలో ప్రజావిప్లవం రాబోతోంది..మళ్లీ సీఎం చంద్రబాబే: ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర

  • అనేక సంక్షేమ పథకాలను ప్రభుత్వం ప్రవేశపెట్టింది
  • ఆ కృతఙ్ఞత తెలిపేందుకని ప్రజలు ఓట్లు వేశారు
  • గతంలో జగన్ సీఎం అయిపోతున్నాడంటే ఏమైంది?

ఏపీలో ప్రజా విప్లవం రాబోతోందని, మళ్లీ కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబేనని పొన్నూరు టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ధీమా వ్యక్తం చేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రభుత్వం ప్రవేశపెట్టిందని, ఈ ప్రభుత్వం చేసిన పనులపై కృతఙ్ఞత తెలిపేందుకని ప్రజలు గంటల తరబడి క్యూ లైన్లలో నిలబడి ఓట్లు వేశారని అన్నారు.

2014లో జగన్ సీఎం అయిపోతున్నాడంటూ ఆ పార్టీ నేతలు శాఖలు కూడా పంచుకున్నారని సెటైర్లు విసిరారు. అదే పరిస్థితి ఈసారి కూడా ఆ పార్టీకి వస్తుందని అన్నారు. బ్రహ్మాండమైన మెజార్టీతో పొన్నూరు నియోజకవర్గంలో తన గెలుపు ఖాయమని సిట్టింగ్ ఎమ్మెల్యే నరేంద్ర విశ్వాసం వ్యక్తం చేశారు.

Andhra Pradesh
Telugudesam
MLA
Dhulipala Narendra
  • Loading...

More Telugu News