Chiranjeevi: చిరు, కొరటాల సినిమాలో ఛాన్స్ కొట్టేసిన అనసూయ!

  • ‘రంగస్థలం’లో మెప్పించిన అనసూయ
  • కథానాయిక పాత్రకు సమానంగా అనసూయ పాత్ర
  • స్క్రిప్ట్ విన్న వెంటనే గ్రీన్ సిగ్నల్

ప్రముఖ యాంకర్ అనసూయ ఇటీవల రామ్ చరణ్ నటించిన ‘రంగస్థలం’ సినిమాలో కీలకపాత్ర పోషించి మెప్పించింది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి సినిమాలో ఛాన్స్ కొట్టేసిందనే వార్త ఫిలింనగర్‌లో చక్కర్లు కొడుతోంది. కొరటాల శ్రీనివాస్, చిరు కాంబినేషన్‌లో సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే.

ఈ సినిమాలోనే అనసూయ అవకాశం దక్కించుకుందని ఫిలిం వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. చిరు సినిమాలో అవకాశం కావడం, తన పాత్ర కథానాయిక పాత్రకు సమానంగా ఉండటంతో స్క్రిప్ట్ విన్న వెంటనే అనసూయ ఈ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ‘సైరా నరసింహారెడ్డి’ షూటింగ్ పూర్తి కాగానే ఈ సినిమా పట్టాలెక్కనుందని సమాచారం.

Chiranjeevi
Anasuya
Ramcharan
Koratala Siva
Ranga Stalam
Saira Narasimhareddy
  • Loading...

More Telugu News