Andhra Pradesh: టీడీపీ నేత సుజనా చౌదరికి సీబీఐ సమన్లు!

  • 2017లో ఆంధ్రా బ్యాంకును మోసం చేసిన కేసు
  • ఈ కేసులో సమన్లు జారీ చేసిన సీబీఐ
  • రేపు మధ్యాహ్నం బెంగళూరు వెళ్లనున్న సుజనా

కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ నేత సుజనా చౌదరికి సీబీఐ నుంచి పిలుపు వచ్చింది. బ్యాంకుల వద్ద రుణాలు తీసుకుని మోసం చేసిన కేసులో ప్రశ్నించే నిమిత్తం సుజనాను సీబీఐ పిలిచినట్టు తెలుస్తోంది. 2017లో ఆంధ్రా బ్యాంకును రూ.71 కోట్ల మేర మోసం చేసిన కేసు నిమిత్తం సీబీఐ బెంగళూరు బ్రాంచ్ ఆయనకు సమన్లు జారీ చేసినట్టు సమాచారం. ఈ కేసు విచారణ నిమిత్తం తమ ముందు హాజరు కావాలంటూ సుజనా చౌదరికి సీబీఐ సమన్లు జారీ చేసింది. రేపు మధ్యాహ్నం బెంగళూరు సీబీఐ అధికారుల ముందు సుజనా చౌదరి హాజరు కానున్నట్టు తెలుస్తోంది.

Andhra Pradesh
Telugudesam
Sujana Chowdary
bengaluru
  • Loading...

More Telugu News