Uttar Pradesh: వారణాసిలో ప్రధాని రోడ్ షో ప్రారంభం..‘మోదీ’ నినాదాలతో మార్మోగుతున్న బెనారస్!

  • అధిక సంఖ్యలో తరలి వచ్చిన ప్రజలు, కార్యకర్తలు
  • రోడ్ షో అనంతరం గంగా హారతిలో పాల్గొననున్న మోదీ
  • వారణాసిలో రేపు నామినేషన్ వేయనున్న మోదీ

వారణాసి లోక్ సభ అభ్యర్థిగా మోదీ రేపు నామినేషన్ వేయనున్నారు. ఈ నేపథ్యంలో ఆ నియోజకవర్గంలో మోదీ రోడ్ షో ప్రారంభించారు. ఈరోజు సాయంత్రం ప్రారంభించిన ఆయన రోడ్ షో కొనసాగుతోంది. ప్రజలు, బీజేపీ అభిమానులు, కార్యకర్తలు, నాయకులు, పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ‘మోదీ..మోదీ’ నినాదాలతో ఆ ప్రాంతం మార్మోగుతోంది. అంతకుముందు, బెనారస్ హిందూ యూనివర్శిటీ (బీహెచ్ యూ) గేట్ వద్ద మదన్ మోహన్ మాలవ్యకు మోదీ నివాళులర్పించారు. రోడ్ షో అనంతరం గంగా హారతిలో ఆయన పాల్గొననున్నారు. కాగా, 2014 ఎన్నికల్లో వారణాసి నుంచి పోటీ చేసిన మోదీ భారీ మెజార్టీతో గెలిచారు.

Uttar Pradesh
Varanasi
PM
Modi
BJP
  • Loading...

More Telugu News