Inter: సచివాలయం ముట్టడికి విద్యార్థి సంఘాల యత్నం.. తోపులాట

  • దాదాపు 50 మంది అరెస్ట్
  • జగదీశ్‌రెడ్డిని బర్తరఫ్ చేయాలి
  • గ్లోబరినా సంస్థపై చర్యలు తీసుకోవాలి

తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో జరిగిన అవకతవకలపై రాష్ట్రం అట్టుడుకుతోంది. ఈ నేపథ్యంలో నేడు ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ విద్యార్థి సంఘాలు సచివాలయం ముట్టడికి యత్నించాయి. దీంతో సచివాలయం వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో పోలీసులకు, విద్యార్థి సంఘాలకు మధ్య తోపులాట జరిగింది.

ఈ సందర్బంగా దాదాపు 50 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంత్రి జగదీశ్‌రెడ్డిని బర్తరఫ్ చేయడమే కాకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడిన అధికారులపైనా, గ్లోబరీనా సంస్థపైనా చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి.

Inter
Telangana
Jagadeesh Reddy
Globareena
Secretariat
AISF
  • Loading...

More Telugu News