‌Yamini Sadineni: పసుపు-కుంకుమ డబ్బులు మహిళలకు అందకుండా సీఎస్ కుట్ర... ప్రజలు తరిమికొడతారు: యామిని సాధినేని

  • వైసీపీ చేతిలో సీఎస్ పావుగా మారారు
  • టీటీడీ బంగారంపై రాజకీయాలా?
  • విజయసాయిరెడ్డి సభ్యత లేకుండా మాట్లాడుతున్నారు

తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి యామిని సాధినేని తాజా పరిణామాలపై ఘాటుగా స్పందించారు. సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యంను పావుగా చేసుకుని వైసీపీ రాజకీయాలు చేస్తోందంటూ మండిపడ్డారు. రాష్ట్రంలో మహిళలకు పసుపు-కుంకుమ డబ్బులు అందకుండా సీఎస్ కుట్రలు చేస్తున్నారని యామిని ఆరోపించారు. ఎంతో మేలు చేసే సంక్షేమ పథకాలను అడ్డుకోవాలని చూస్తే ప్రజలే తరిమి కొడతారంటూ వ్యాఖ్యానించారు.

తిరుమల వెంకటేశ్వరస్వామి బంగారంపై వైసీపీ నేతలు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని, భక్తుల మనోభావాలు దెబ్బతినేలా వ్యాఖ్యలు చేస్తున్నారంటూ విమర్శించారు. వైసీపీ నేత విజయసాయిరెడ్డి రాజ్యసభ సభ్యుడ్నన్న జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

‌Yamini Sadineni
Telugudesam
Andhra Pradesh
Vijay Sai Reddy
YSRCP
  • Loading...

More Telugu News