constable: ప్రియురాలికి నిశ్చితార్థం జరగడంతో మనస్తాపం.. కానిస్టేబుల్ ఆత్మహత్య

  • ఓ యువతిని ప్రేమిస్తున్న అజిన్ రాజ్
  • తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య
  • 21 రోజుల సెలవు తర్వాత నిన్ననే విధుల్లో చేరిన రాజ్

ప్రియురాలికి మరొక వ్యక్తితో పెళ్లి నిశ్చయం కావడంతో ఓ కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే, కన్యాకుమారి జిల్లి నడైక్కాపూర్ గ్రామానికి చెందిన అజిన్ రాజ్ (28) అనే వ్యక్తి మణిముత్తారు 9వ బెటాలియన్ లో కానిస్టేబుల్ గా పని చేస్తున్నాడు. ఓ యువతిని అతను ప్రేమిస్తున్నాడు. అయితే, ఆమెకు మరొక వ్యక్తితో ఆమె తల్లిదండ్రులు పెళ్లి నిశ్చయం చేసినట్టు తెలుసుకున్న అజిన్ రాజ్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఆమె లేని జీవతం వృథా అనుకుని తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 21 రోజుల సెలవు అనంతరం నిన్ననే అతను విధుల్లో చేరాడు.

constable
Tamilnadu
suicide
love
  • Loading...

More Telugu News