Uttar Pradesh: ముస్లింల పెళ్లిపత్రికలో సీతారాముల ఫొటో!

  • అందరికీ ఆదర్శంగా నిలిచిన ఉత్తరప్రదేశ్ కుటుంబం
  • పరమత సహనాన్ని చాటిన వైనం
  • పత్రికను చూసి సంతోషించిన హిందువులు

ఒక ముస్లిం కుటుంబం పరమత సహనాన్ని చాటి అందరికీ ఆదర్శంగా నిలిచింది. పెళ్లిపత్రికలో సీతారాముల ఫొటోను ముద్రించి అందరూ ఒక్కటేనని చాటింది. ఉత్తరప్రదేశ్ లోని చిలావా గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

తమ కుమార్తె వివాహం సందర్భంగా తల్లిదండ్రులు ఈ విధమైన పత్రికను తయారు చేయించారు. ఈ సందర్భంగా వధువు తల్లి మాట్లాడుతూ, తమ గ్రామంలో హిందూ, ముస్లింలు సోదరభావంతో మెలుగుతుంటారని చెప్పారు. పరమత సహనాన్ని తాము ప్రచారం చేయాలనుకున్నామని తెలిపారు. మత పరంగా తాము విడిపోవాలనుకోవడం లేదని చెప్పారు.

వధువు సోదరుడు మొహమ్మద్ ఉమర్ మాట్లాడుతూ, పెళ్లిపత్రికను చూసి తమ గ్రామస్తులంతా చాలా సంతోషించారని అన్నాడు. జనాల స్పందన చాలా సంతోషాన్ని కలిగించిందని చెప్పాడు.

Uttar Pradesh
muslim
marriage
wedding card
seetha
ram
  • Loading...

More Telugu News