Sachin Tendulkar: సచిన్ కు నోటీసులు జారీ చేసిన బీసీసీఐ అంబుడ్స్ మన్

  • రెండు పదవుల్లో ఉన్న సచిన్
  • ఏప్రిల్ 28లోగా వివరణ ఇవ్వాలంటూ నోటీసులు
  • ఇటీవలే అంబుడ్స్ మన్ ముందు హాజరైన గంగూలీ

క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కు బీసీసీఐ అంబుడ్స్ మన్ డీకే జైన్ నోటీసులు జారీ చేశారు. క్రికెట్ అడ్వైజరీ కమిటీ సభ్యుడిగా, ముంబై ఇండియన్స్ ఐపీఎల్ ఫ్రాంచైజీ మెంటార్ గా రెండు లాభదాయకమైప పదవులను అనుభవిస్తున్నారంటూ నోటీసులు ఇచ్చారు. ఏప్రిల్ 28 లోగా నోటీసులకు లిఖితపూర్వకంగా సమాధానం చెప్పాలని నోటీసులో కోరారు.

గడువులోగా స్పందించకపోతే... ఆ తర్వాత వివరణ ఇచ్చేందుకు మీకు అవకాశం ఉండబోదని చెప్పారు. నోటీసుకు సంబంధించిన ఒక కాపీని బీసీసీఐకి కూడా పంపించారు. ఇదే అంశానికి సంబంధించి సౌరవ్ గంగూలీ కూడా ఇటీవలే జైన్ ముందు హాజరయ్యారు. బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా, ఐపీఎల్ ఫ్రాంచైజీ ఢిల్లీ క్యాపిటల్స్ సలహాదారుడిగా, క్రికెట్ అడ్వైజరీ కమిటీ సభ్యుడిగా గంగూలీ ఉన్నారు.

Sachin Tendulkar
dk jain
notice
bcci
  • Loading...

More Telugu News