Air India: అమెరికా వెళ్లాల్సిన ఎయిరిండియా బోయింగ్ 777లో మంటలు!

  • శాన్ ఫ్రాన్సిస్కో వెళ్లాల్సిన విమానం
  • ఏసీ రిపేర్ చేస్తుండగా మంటలు
  • వెంటనే అదుపు చేసిన సిబ్బంది

దేశ రాజధాని న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో ప్రయాణానికి సిద్ధమవుతున్న ఎయిరిండియా అంతర్జాతీయ విమానంలో మంటలు చెలరేగడం కలకలం రేపింది. న్యూఢిల్లీ నుంచి శాన్ ఫ్రాన్సిస్కో వెళ్లాల్సిన బోయింగ్ 777 విమానంలో సిబ్బంది ఏసీ మరమ్మతు పనులు చేస్తున్న వేళ, షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. వెంటనే వాటిని అదుపు చేశామని, ఆ సమయంలో విమానంలో ప్రయాణికులు ఎవరూ లేరని ఉన్నతాధికారులు వెల్లడించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.



Air India
Fire Accident
Boing 777
  • Loading...

More Telugu News