Telangana: మరో ఇద్దరు విద్యార్థుల బలవన్మరణం... వరంగల్ లో సింధు, భువనగిరిలో మితి ఆత్మహత్య!

  • రెండు సబ్జెక్టుల్లో ఫెయిలైన మితి
  • నాలుగు రోజులుగా తీవ్ర మనస్తాపం
  • ఉరివేసుకుని ఆత్మహత్య
  • పురుగుల మందు తాగిన సింధు

తెలంగాణ ఇంటర్ మూల్యాంకనం అవకతవకలు మరో రెండు ప్రాణాలను బలిగొన్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా, బొమ్మలరామారం సమీపంలోని నాగినేనిపల్లి గ్రామంలో మితి (19) అనే ఇంటర్‌ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. బీబీనగర్‌ లోని ఓ కాలేజీలో బైపీసీ పూర్తి చేసిన మితి, జువాలజీ, కెమిస్ట్రీ సబ్జెక్టుల్లో ఫెయిలైంది. గత నాలుగైదు రోజులుగా తీవ్ర మనస్తాపంతో ఉన్న మితి, కుటుంబ సభ్యులు నిద్రలో ఉండగా బుధవారం ఉరి వేసుకుంది.

మరో ఘటనలో వరంగల్‌ రూరల్‌ జిల్లా శాయంపేట మండలం పత్తిపాకకు చెందిన ఐరబోయిన సింధు (18) పురుగు మందు తాగింది. నిన్న మెదక్ జిల్లాలో రాజు అనే విద్యార్థి సైతం ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. విద్యార్థులు తొందరపడి సూసైడ్ యత్నాలు చేయరాదని సీఎం కేసీఆర్ సహా, పలువురు ప్రముఖులు, విద్యావేత్తలు నచ్చజెబుతున్నారు.

Telangana
Inter
Exams
Sucide
  • Loading...

More Telugu News