Madhya Pradesh: మధ్యప్రదేశ్ సీఎం దావోస్ పర్యటన ఖర్చు రూ.1.58 కోట్లట!

  • జనవరిలో దావోస్ ఆర్థిక సదస్సుకు హాజరైన కమల్‌నాథ్
  • సమాచార హక్కు చట్టం ద్వారా వెలుగులోకి ఖర్చుల వివరాలు
  • ఖర్చు చూసి విస్తుపోయిన సామాజిక ఉద్యమకారుడు

ఈ ఏడాది జనవరిలో దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదిక సమావేశానికి ముగ్గురు అధికారులతో కలిసి మధ్యప్రదేశ్ సీఎం కమల్‌నాథ్ హాజరయ్యారు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా ఆయన ఈ సదస్సుకు హాజరయ్యారు. అయితే, పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు వెళ్లిన సీఎం ఖర్చులు చూస్తే మాత్రం ముక్కున వేలేసుకోకతప్పదు.

సదస్సుకు వెళ్లిన వారు స్విట్జర్లాండ్‌లో ఉండడానికి చేసిన ఖర్చు ఏకంగా రూ.1.58 కోట్లు. సమాచార హక్కు చట్టం ద్వారా అజయ్ దూబే అనే సామాజిక ఉద్యమకారుడు అడిగిన ప్రశ్నకు ప్రభుత్వం నుంచి వచ్చిన సమాధానం ఇది. విమాన టికెట్లు, వీసా, వసతి, జ్యూరిచ్ విమానాశ్రయంలో వీఐపీ లాంజ్‌లోకి ప్రవేశించడానికి, ఇతర ఖర్చులు అన్నీ కలిపి ఈ మొత్తం ఖర్చు అయినట్టు సమాచారం కోరిన వ్యక్తికి ఇచ్చిన పత్రాల్లో పేర్కొన్నారు.

Madhya Pradesh
kamalnath
Davos
  • Loading...

More Telugu News