Telangana: బీజేపీ నేత కిషన్ రెడ్డికి బెదిరింపు ఫోన్ కాల్ !

  • హతమారుస్తామని గుర్తుతెలియని వ్యక్తి  బెదిరింపులు
  • ఉర్దూ భాషలో మాట్లాడిన ఆగంతకుడు
  • కాచిగూడ పోలీస్ స్టేషన్ లో కిషన్ రెడ్డి ఫిర్యాదు

బీజేపీ సీనియర్ నేత కిషన్ రెడ్డిని హతమారుస్తామంటూ గుర్తుతెలియని వ్యక్తి నుంచి బెదిరింపులు వచ్చాయి. నిన్న రాత్రి పది గంటల సమయంలో కిషన్ రెడ్డికి ఈ ఫోన్ కాల్ వచ్చినట్టు సమాచారం. ఆగంతకుడు ఉర్దూలో మాట్లాడాడని, ఆయన్ని హతమారుస్తామంటూ బెదిరించాడని సమాచారం. ఈ నేపథ్యంలో కాచిగూడ పోలీస్ స్టేషన్ లో కిషన్ రెడ్డి ఫిర్యాదు చేశారు. తనకు ఫోన్ చేసిన ఆగంతకుడు ఉగ్రవాదేమోనని కిషన్ రెడ్డి అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బెదిరింపు ఫోన్ కాల్ నేపథ్యంలో కిషన్ రెడ్డికి అదనపు భద్రత ఏర్పాటు చేశారు. కాగా, గతంలో కూడా కిషన్ రెడ్డికి బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చాయి.

Telangana
BJP
Kishan reddy
kachiguda
PS
  • Loading...

More Telugu News