YSRCP: విజయసాయిరెడ్డి తన నేరబుద్ధిని బయటపెట్టుకున్నారు: కేఈ కృష్ణమూర్తి

  • పలు కేసుల్లో నిందితుడు విజయసాయిరెడ్డి
  • నేరాలు చేసిన వారి కళ్లకు అందరూ అలానే కన్పిస్తారు
  • దుష్ప్రచారం చేయడం అపచారం  

టీటీడీ బంగారాన్ని కాజేసేందుకు కుట్ర జరిగిందంటూ మాట్లాడి, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తన నేర బుద్ధిని బయటపెట్టుకున్నారని ఏపీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి మండిపడ్డారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న వ్యక్తి నోటి నుంచి అంతకన్నా మంచి మాటలు ఎలా వస్తాయని ఎద్దేవా చేశారు. నేరాలు, ఘోరాలు చేసే వారి కళ్లకు అందరూ అలానే కన్పిస్తారని అన్నారు.

టీటీడీ బంగారాన్ని బ్యాంకుల్లో డిపాజిట్ చేసే ప్రక్రియ ఎప్పటి నుంచో ఉన్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. డిపాజిట్ గడువు ముగిశాక ఆ బంగారాన్ని అప్పగించాల్సిన బాధ్యత బ్యాంకుదేనని స్పష్టం చేశారు. టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, టీటీడీ బోర్డు సభ్యుడిగా విజయసాయిరెడ్డి ఉన్నప్పుడు వారి కళ్లన్నీ స్వామి వారి బంగారంపైనే ఉన్నాయన్న విషయం తాజా వ్యాఖ్యల ద్వారా అర్థమౌతోందని వ్యాఖ్యానించారు. దేవుడి సొమ్ము దొంగిలించడం ఎంత నేరమో, దుష్ప్రచారం చేయడం అంతకుమించిన అపచారమని కేఈ అన్నారు. 

YSRCP
vijayasai reddy
Telugudesam
ke
krishnamurthy
  • Loading...

More Telugu News